రూ.100కోట్లతో ప్రముఖుల భద్రతకు బెల్జియం ఆయుధాలు
- October 28, 2018
ప్రముఖుల భద్రత కోసం బెల్జియం దేశానికి చెందిన అధునాతన ఆయుధాల ను కొనుగోలు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులతో పాటు ఎస్పిజి రక్షణ లో వున్న వివిఐపిల కోసం త్వరలో ఈ ఆయుధాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం కేంద్రం వంద కోట్ల రూపాయలను వెచ్చించేందుకు నిర్ణయించింది. ప్రముఖుల భద్రత కల్పిస్తున్న ఎస్పిజి కమెండోల వద్ద ప్రస్తుతం గ్లాక్ పిస్ట ళ్లు, ఎంపి 5 సబ్ మెషిన్స్తో పాటు ఎకె 47, ఎకె 56 తుపాకులు వున్నాయి. దేశ వ్యాప్తంగా ఉగ్రవాదంతో పాటు తీవ్ర వాద సమస్యలు పెరిగిన నేపథ్యంలో ప్రముఖుల భద్రత కల్పించడం భద్రతా బలగాలకు సవాల్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బెల్జియం దేశానికి చెందిన ఎఫ్.ఎన్ పిస్టళ్లతో పాటు ఫైవ్ సెవన్ పి 90 సబ్ మిషిన్స్ తెప్పించేందుకు కేం ద్రం నిర్ణయించింది. ఈ ఆయుధాలను కొనుగోలు చేసేందుకు వంద కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోం శాఖ ఇప్పటికే బెల్జియం ప్రభుత్వంతో చర్చలు జరిపింది. రెండు మూడు నెలల్లో ఈ ఆయుధాలు ఎస్పిజి కమెండోలకు అం దుబాటులోకి రానున్నాయని సమాచారం.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







