పాక్ సైనిక కార్యాలయంపై కాల్పులు జరిపిన భారత్
- October 29, 2018
నియంత్రణ రేఖ దగ్గర్లో ఉన్న పాకిస్తాన్ సైనిక పాలక ప్రధాన కార్యాలయంపై భారత్ కాల్పులు జరిపినట్లు అధికారులు చెప్పారు. ఈ నెల 23న జమ్మూ కశ్మీర్లోని పూంచ్, ఝల్లాస్ల్లో పాకిస్తాన్ ఆర్మీ జరిపిన కాల్పులకు ప్రతీకారంగా భారత సైన్యం తాజాగా కాల్పులకు దిగిందన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఖ్యురత్త, సమానీ ప్రాంతాలపై కూడా భారత జవాన్లు దాడులు జరిపారనీ, పీవోకేలో పొగలు వస్తున్నట్లు సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా చెప్పారని ఓ అధికారి వెల్లడించారు. పాకిస్తానీ ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి పొగ వస్తున్నట్లు కొన్ని ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పాకిస్తాన్ ఎంత రెచ్చగొట్టినా భారత్ ఇన్నాళ్లూ నిగ్రహాన్ని పాటించిందనీ, తాము కూడా ప్రతీకార దాడులు చేస్తామనేందుకు తాజా కాల్పులు పాక్కు గట్టి సంకేతమని తెలిపారు. పీవోకేలోని పౌర ప్రాంతాలపై ఆర్మీ కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







