మగ బిడ్డకు జన్మనిచ్చిన సానియా.!
- October 29, 2018
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ పాక్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. 'ఈ శుభవార్త మీ అందిరితో పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. నా భార్య కూడా ఆరోగ్యంగా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆశీస్సులకు ధన్యవాదాలు' అని వెల్లడిస్తూ 'బేబీ మీర్జా మాలిక్' అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ విషయం తెలీగానే సానియా స్నేహితురాలు, ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 'చాలా కాలం తర్వాత ఓ శుభవార్త విన్నాను. కంగ్రాట్స్ సానియా, షోయెబ్.' అని ట్వీట్ చేశారు. తొలి బిడ్డకు జన్మనిచ్చిన సందర్భంగా షోయెబ్ మాలిక్ ఆనందానికి అవధుల్లేకుండాపోయానని, ఆయన సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారని అతని మేనేజర్ మీడియా ద్వారా వెల్లడించారు. 2010లో సానియా, షోయెబ్‌ల వివాహం జరిగింది. బిడ్డ కోసం టెన్నిస్‌కు దూరంగా ఉన్న సానియా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్నట్లు గతంలో వెల్లడించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







