విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళిన ఖలీఫాశాట్‌

- October 30, 2018 , by Maagulf
విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళిన ఖలీఫాశాట్‌

యూ.ఏ.ఈ:పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఖలీఫాశాట్‌ని యూఏఈ విజయవంతంగా నింగిలోకి పంపగలిగింది. జపాన్‌లోని తనెగాషిమా స్పేస్‌ సెంటర్‌ నుంచి ఖలీఫా శాటిలైట్‌ నింగిలోకి దూసుకెళ్ళింది. హెచ్‌2-ఎ రాకెట్‌ ద్వారా ఈ రాకెట్‌ని అంతరిక్షంలోకి పంపడం జరిగింది. ఈ రాకెట్‌ ద్వారా ఖలీఫాశాట్‌తోపాటుగా జపాన్‌కి చెందిన గో శాట్‌ 2 కూడా నింగిలోకి వెళ్ళింది. మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ స్పేస్‌ సెంటర్‌ 9ఎంబిఆర్‌ఎస్‌సి) వెబ్‌సైట్‌ ద్వారా శాటిలైట్‌ లాంఛ్‌ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. రాకెట్‌ ప్రయోగం జరిగిన 100 నిమిషాల్లో ఖలీఫా శాట్‌ ఎంపిక చేసిన ఆర్బిట్‌లోకి చేరుకుందని అధికారులు పేర్కొన్నారు. ఎంబిఆర్‌ఎస్‌సికి చెందిన 70 మంది ఎమిరేటీ ఇంజనీర్లు ఖలీఫా శాటిలైట్‌ని రూపొందించారు. 2009లో దుబాయ్‌ శాట్‌1, 2013లో దుబాయ్‌ శాట్‌ 2 శాటిలైట్లను యూఏఈ అంతరిక్షంలోకి పంపింది. యహ్‌శాట్‌ 1,2, తురాయా 1,2,3 శాటిలైట్లను కూడా గతంలో పంపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com