నవంబరు 1 నుంచి ఈశాన్య ఋతుపవనాలు : భారత వాతవరణ శాఖ

- October 30, 2018 , by Maagulf
నవంబరు 1 నుంచి ఈశాన్య ఋతుపవనాలు : భారత వాతవరణ శాఖ

నవంబరు 1 నుంచి ఈశాన్య ఋతుపవనాలు మొదలు కానున్నాయని భారత వాతవరణ శాఖ తెలిపింది. ఈ ఈశాన్య ఋతుపవనాల వలన తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అక్టోబరు 20 నుంచే ఈశాన్య ఋతుపవనాలు మొదలు కావాలని, అయితే ఈ సంవత్సరం కాస్త ఆలస్యమైందని వారు తెలిపారు. కాగా ఇదివరకే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడాలని, కానీ ఈశాన్య ఋతుపవనాల ఆలస్యంతో ఏర్పడలేదని భారత వాతవరణ శాఖ (ఐఎండి) అదనపు డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజ§్‌ు మహాపాత్ర తెలిపారు.ఈ వర్షాలు తమిళనాడు,పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ లోని రాయలసీమ, దక్షిణ కోస్తాలోని ప్రాంతాలు, కేరళలోని కొన్ని ప్రాంతాలలోని వ్యవసాయానికి కీలకమని తెలిపారు.ఈశాన్య ఋతుపవనాల ఆగమనాన్ని శ్రీలంక సమీపంలోని దక్షిణ బంగాళాఖాతం లోని గుర్తించామని, ఐదు రోజుల్లోనే వర్షాలు ప్రారంభం కానున్నాయని ఐఎండి పేర్కొంది. మరో వైపు నైరుతి ఋతుపవనాలు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అక్టోబరు 21 నుంచే నిష్క్రమించాయని ఐఎండి తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com