'ఉక్కుమనిషి' భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

- October 30, 2018 , by Maagulf
'ఉక్కుమనిషి' భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

ఉక్కుమనిషి, భారత ఉప ప్రధాని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 143వ జయంతి సందర్భంగా ఆయన స్మారకార్థం నర్మదా నది ఒడ్డున ఏర్పాటుచేసిన 'ఐక్యతా విగ్రహం- స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ'ని ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేసారు. సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ సమీపంలో ఉన్న సాధు బెట్‌లో 'స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ' నిర్మించారు. ఈ విగ్రహం 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా గుర్తింపు పొందింది. 30 పవిత్ర నదీ జలాలతో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పటేల్‌ విగ్రహానికి హెలికాప్టర్లతో అభిషేకం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com