గ్రేడ్‌ 1 స్టూడెంట్స్‌కి ఫీజు వార్తలు అవాస్తవం

- December 20, 2015 , by Maagulf
గ్రేడ్‌ 1 స్టూడెంట్స్‌కి ఫీజు వార్తలు అవాస్తవం

ప్రభుత్వ స్కూళ్ళలో గ్రేడ్‌ 1 విద్యార్థులు ఇకపై ఫీజులు చెల్లించాల్సి వస్తుందంటూ వినిపిస్తున్న ఊహాగానాల్ని మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కొట్టి పారేసింది. ప్రభుత్వ స్కూళ్ళలో గ్రేడ్‌ 1 విద్యార్థుల కోసం ఎలాంటి ఫీజు ప్రతిపాదన లేదని మినిస్ట్రీ స్పష్టం చేసింది. గ్రేడ్‌ 1 విద్యార్థులు ఇక నుంచి 10 ఒమన్‌ రియాల్స్‌ ఎడ్యుకేషన్‌ ఫీజ్‌ కింద చెల్లించాల్సి ఉంటుందని ట్విట్టర్‌లో ప్రచారం జరుగుతుంది. అయితే ప్రభుత్వ స్కూళ్ళలో ఒమన్‌ పౌరులకు ఉచిత విద్యుత్‌ కొనసాగించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామనీ, ఇది ఒమన్‌ సిటజన్స్‌ హక్కు అని మినిస్ట్రీ చెప్పింది. దీనికి సంబంధించి ఎటువంటి రూమర్స్‌నీ ఒమన్‌ సిటిజన్స్‌ నమ్మరాదని ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com