ఇరాన్ లో నిరసన..జైలు పాలైన కార్మికులు
- October 31, 2018
టెహ్రాన్: వేతన బకాయిల కోసం ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి జైలులోకి నెట్టటాన్ని ఇరాన్ కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. గత వేసవిలో దేశవ్యాప్తంగా జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో కార్మికులు పాల్గొన్నారు. ఈ ఆందోళనలో పాల్గొన్న కార్మికులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని హెవీ ఎక్విప్‌మెంట్ ప్రొడక్షన్ కంపెనీ (హెప్కో)కు చెందిన వారని, గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ కంపెనీ ప్రైవేటు పరం కావటంతో వీరంతా తమ వేతన బకాయిల కోసం ఆందోళన చేశారని ఇరాన్ కమ్యూనిస్టు పార్టీ తుడే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి నవీద్ షొమాలి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆందోళనలో పాల్గొన్న 15 మంది హెప్కో కార్మికులకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయటం అమానుషమని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్దయెత్తున ఐక్యపోరాటాలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని ఆయన ఇరాన్ కార్మికలోకానికి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!