బీబీకి స్వేచ్ఛ..మరణశిక్షను రద్దు

- October 31, 2018 , by Maagulf
బీబీకి స్వేచ్ఛ..మరణశిక్షను రద్దు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ స్తంభించిపోయింది. దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. దైవ దూషణ కేసులో క్రైస్తవ మహిళ ఆసియా బీబీకు మరణశిక్ష నుంచి విముక్తి కల్పించడంతో మతచాంధసవాదులు ఆందోళన చేపట్టారు. లాహోర్‌, ఇస్లామాబాద్‌, కరాచీతో పాటు ఇతర నగరాల్లోనూ నిరసనకారులు రహదారులను అడ్డుకున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఆందోళనకారులు మూసివేశారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్ ఇచ్చినా.. ఆందోళనకారులు రెండవ రోజు ధర్నా కొనసాగిస్తూనే ఉన్నారు. రాజకీయ లబ్ది కోసమే ప్రజలను రెచ్చగొడుతున్నారని, నిరసనకారులు ఇస్లాం మతానికి సేవ చేయడం లేదని ఇమ్రాన్ తన సందేశంలో అన్నారు. మహ్మాద్ ప్రవక్తను అవమానపరిచాన్న కేసులో ఆసియా బీబీని అరెస్టు చేశారు. 2010లో నమోదైన కేసులో ఆమెకు మరణశిక్షను ఖరారు చేశారు. అయితే ఆమె అభ్యర్థనను స్వీకరించిన పాకిస్థాన్ సుప్రీంకోర్టు .. బధవారం ఆసియా బీబీకి స్వేచ్ఛను ప్రసాదిస్తూ మరణశిక్షను రద్దు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com