మహేష్ హీరోయిన్ ని పరామర్శించిన నమ్రత
- November 01, 2018
బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే తెలుగులో మహేష్ బాబు సరసన మురారీ సినిమాలో నటించింది. ఆ అభిమానంతోనే క్యాన్సర్‌తో పోరాడుతూ న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సోనాలీని చూడడానికి మహేష్ బాబు భార్య నమ్రత వెళ్లింది. వివాహం చేసుకున్న తరువాత సిల్వర్ స్క్రీన్‌కు దూరమైన సోనాలీకి ఒక బాబు ఉన్నాడు. గత కొంత కాలంగా హైగ్రేడ్ క్యాన్సర్ బాధపడుతోంది. ఈ విషయాన్ని సోనాలీ జులైలో తనే స్వయంగా ప్రకటించింది.
అప్పటి నుంచి చికిత్స తీసుకుంటోంది. చికిత్సలో భాగంగా కీమో థెరపీ చేయించుకుంటున్న సమయంలో జుట్టంతా రాలిపోతుంది. గుండుతో ఉండాల్సి వచ్చినా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా దాన్ని కూడా సంతోషంగానే స్వీకరించింది. ధైర్యంగా ఉన్నానంటూ అభిమానులకోసం ఆ ఫోటోలను షేర్ చేసింది. ఇప్పటికే ఆమెను బాలీవుడ్ సెలబ్రెటీలు చాలామంది పలకరించారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా సోనాలీని కలిసి వచ్చారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. సోనాలి గురిచి చెబుతూ.. తనకి ధైర్యం చాలా ఎక్కువని, క్యాన్సర్ బారి నుంచి కోలుకుంటోందని అన్నారు.
త్వరలో సాధారణ జీవితం గడపనుంది అని నమ్రత తెలిపింది. ఆమెతో గడిపిన కొద్ది సమయం చాలా సంతోషంగా అనిపించిందని, చాలా విషయాలు చర్చించుకున్నామని వివరించింది. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తానని తెలిపింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







