బ్రేకింగ్.. భారత దేశ రాజకీయాల్లో కీలక పరిణామం..
- November 01, 2018
ఢిల్లీ:భారత దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మోడీ వ్యతిరేక కూటమి కోసం పార్టీలన్నింటినీ ఏకం చేసే ప్రయత్నంలో ఉన్న సీఎం చంద్రబాబు.. టీడీపీ పుట్టుకతోనే కాంగ్రెస్‌తో ఉన్న వైరాన్ని పక్కనపెట్టి.. రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ నివాసంలో జరుగుతున్న ఈ కీలక భేటీ.. దేశ రాజకీయాల్ని ఆకర్షిస్తోంది.
ప్రధానంగా రాహుల్-చంద్రబాబు భేటీలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు వెంట ఎంపీలు జయదేవ్…కనకమేడల, సీఎం రమేష్, కంభంపాటి ఉండగా.. భేటీలో రాహుల్‌తో పాటు కొప్పుల రాజు, అహ్మద్ పటేల్ ఉన్నారు.
అటు.. ప్రత్యామ్నాయ కూటమిపై వివిధ పార్టీలతో చంద్రబాబు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఫరూఖ్ అబ్దుల్లా, శరద్ పవార్‌తోనూ చంద్రబాబు చర్చలు జరిపారు. ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్‌తోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!