లండన్ విమానాశ్రయంలో ఆల్కాహాల్ మోతాదు ఎక్కువైందంటూ పైలట్ అరెస్టు
- November 01, 2018
లండన్ ఎయిర్‌పోర్టులో గురువారం కలకలం రేగింది. ఆల్కాహాల్ సేవించాడంటూ జపాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమాన పైలట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఫ్లైట్ టేకాఫ్‌కు కొద్ది నిముషాల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం అలజడి సష్టించింది. కఠిన నియమాలు, నిబంధనలకు పెట్టింది పేరైన జపాన్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. ఇకపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు చేపడతామనీ, పైలట్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
వివరాలు.. బోయింగ్ 777 విమానం (ఫ్లైట్ నెంబర్ జేఎల్ 44) గురువారం ఉదయం 244 మంది ప్రయాణికులతో లండన్ నుంచి టోక్యో బయలుదేరాల్సి ఉంది. అయితే, విమాన పైలట్ కత్సుతోషి జిత్సుక్వా (42) శరీరంలో ఆల్కాహాల్ శాతం మోతాదుకు మించి ఉందని ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు. జిత్సుక్వా గత రాత్రి అతిగా మద్యం సేవించడంతో అతని శరీరంలో ఆల్కాహాల్ శాతం పరిమితికి ఉందని తెలిపారు. పైలట్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నామని ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది వెల్లడించారు. నిబంధనల ప్రకారం పైలట్ శరీరంలో 100 మిల్లీ లీటర్ల రక్తానికి 80 మిల్లీ గ్రాముల ఆల్కాహాల్ వరకు ఉండొచ్చు. కానీ, జిత్సుక్వా శరీరంలో అది 189 మిల్లీ గ్రాములుగా నమోదైందని పేర్కొన్నారు. నిందితున్ని నవంబర్ 29 న కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. కాగా, ఈ ఉదంతంతో విమానం గంటపాటు నిలిచిపోయింది. అనంతరం మిగతా ఇద్దరు పైలట్లతో టోక్యోకు బయలు దేరింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







