బీజేపీ సెకండ్ లిస్ట్ క్యాండిడేట్లు వీరే..!
- November 01, 2018
తెలంగాణలో కాషాయదళం స్పీడ్ పెంచింది. శుక్రవారం రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. హైకమాండ్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో.. 28 మందితో సెకండ్ లిస్ట్ ప్రకటించబోతోంది. అలాగే ప్రచారంలోనూ జోరు పెంచాలని నిర్ణయించిన కమలనాథులు… ప్రధాని మోడీతో పాటు బీజేపీ పాలిత సీఎంలను రంగంలోకి దించాలని యోచిస్తున్నారు.
తెలంగాణలో కమలనాథులు దూకుడు పెంచారు. ఇప్పటికే 35 మందితో తొలి జాబితా విడుదల చేయగా.. ఈరోజు రెండో విడత అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. 28 మందితో మలి జాబితాను వెల్లడించనున్నారు.
రెండో విడత అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిన తెలంగాణ నాయకత్వం.. ఆ జాబితాను కేంద్ర పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ముందుంచుంది. క్యాండిడేట్ల లిస్టుపై చర్చలు జరిపింది. ఆ తర్వాత బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థులను ఖరారు చేశారు.
బీజేపీ రెండో జాబితాలో 28 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించబోతున్నారు. ఈ లిస్ట్‌లో
చాంద్రాయణగుట్ట నుంచి షెహజాది..
చార్మినార్‌లో ఉమా మహేందర్..
బహదూర్‌పురాలో హనీఫ్‌అలీ..
మలక్‌పేటలో ఆలె జితేంద్ర..
యాకుత్‌పురాలో రూప్‌రాజ్..
కూకట్‌పల్లిలో మాధవరం కాంతారావు ..
ఆలేరులో డి.శ్రీధర్‌రెడ్డి..
కొడంగల్‌లో నాగూరావు నామోజీ..
మహబూబ్‌నగర్‌లో పద్మజారెడ్డి..
దేవరకద్రలో ఎగ్గెని నర్సింహులు..
రామగుండంలో బలమూరి అనిత..
రాజేంద్రనగర్‌లో బద్దం బాల్‌రెడ్డి..
కొత్తగూడెంలో కుంచె రంగా కిరణ్..
ఇబ్రహీంపట్నంలో కొత్త అశోక్..
శేరిలింగంపల్లిలో యోగానంద్..
నిజామాబాద్ నుంచి యెండల లక్ష్మీనారాయణ..
పేర్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఇక.. నవంబర్ 12న నామినేషన్ల స్వీకరణ మొదలు కానుండటంతో.. ఆలోపే అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. దాంతో ప్రచారం చేసుకునేందుకు వీలైనంత ఎక్కువ సమయం ఉంటుందని యోచిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కమలనాథులు.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమ్మేళనాలు ఉధృతం చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి బూత్ నుంచి ఐదువేల మంది పాల్గొనేలా చూసుకుంటున్నారు. అలాగే అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రులు, పార్టీ అగ్రనేతలను ప్రచారానికి రప్పిస్తూ కాషాయ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్నారు.
మరోవైపు మలి జాబితా విడుదల చేయగానే.. మూడో విడత అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాలని బీజేపీ రాష్ట్ర నేతలు నిర్ణయించారు. అయితే మహాకూటమి నుంచి పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చాకే… బీజేపీ మూడో లిస్ట్‌ను ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!