ఎంట్రీ వీసాలు ఉన్నాఅనుమతి లేదు..
- December 21, 2015
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రయత్నించి వీసాలు కూడా పొందిన హైదరాబాద్ విద్యార్థులకు చివరి నిమిషంలో ఊహించని పరిణామం ఎదురైంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలి, నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన 19 మంది విద్యార్ధులు అక్కడికి చేరుకోవడానికి ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అయితే అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఈ రెండు యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్ లో ఉంచారనే కారణంతో ఎయిర్ ఇండియా అధికారులు వీరికి అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల ప్రయాణ ఛార్జీలు తిరిగి చెల్లించినట్లు అధికారులు చెప్పారు. అయితే తమకు అన్ని రకాల అనుమతులు సక్రమంగానే ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. తమకు అమెరికా కాన్సులేట్ వీసా జారీ చేసిన తరువాత ఎయిర్ పోర్టు అధికారులు ఇలాంటి కారణాలు చూపించడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఎంట్రీ వీసాలు ఉన్నందున మరో విమాన సంస్థ ద్వారానైనా అక్కడకు చేరుకుంటామంటున్నారు. తాము అడ్మిషన్ పొందిన యూనివర్సిటీలకు అక్రిడిటేషన్ ఉండని, గతంలో కూడా ఎంతో మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీలకు ఉన్నత చదువులకు వెళ్లారని అంటున్నారు. నార్త్వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీకి 2016 వరకు అనుమతులు ఉన్నాయనీ అయినా కూడా అధికారులు అడ్డుకోవడమేంటి అని ఆ యూనివర్సిటీలో ప్రవేశం పొందిన విద్యార్థి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని యూనివర్సిటీ వర్గాలు కూడా దృవీకరించాయి. పారిస్ దాడుల నేపథ్యంలో అమెరికా చేపడుతున్న భద్రతా చర్యల దృష్ట్యా ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై అమెరికన్ కాన్సులేట్ స్పందించడానికి నిరాకరించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







