అమెరికాలో హెచ్-1బీ వీసాల కుంభకోణం.!
- November 03, 2018
హెచ్-1బీ వీసా మోసం కేసులో భారత సంతతి వ్యక్తిని అమెరికాలోని కాలిఫోర్నియాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉద్యోగులను నిలువరించేందుకు వీసా నిబంధనలను జారీని మరింత కఠినతరం చేసిన నేపథ్యంలో ఇదే అదునుగా భావించిన కావూరు కిష్‌ర్‌కుమార్ (46).. వీసాల కుంభకోణానికి తెర లేపాడు. 2007 నుంచి నాలుగు కన్సల్టింగ్ కంపెనీలకు సీఈఓగా పనిచేస్తున్న కిషోర్.. పలు కంపెనీల్లో విదేశీ ఉద్యోగులను నియమించే అంశంలో వీసా మోసాలు, మెయిల్ మోసాలు చేసినట్లు అధికారులు అభియోగాలు నమోదు చేశారు. అభ్యర్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ వీసా నిబంధనలను అతిక్రమించినట్లు పోలీసులు గుర్తించారు. ఈక్రమంలోనే ఆయణ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వీసాల కేసులో కిషోర్ దోషిగా తేలితే పదేళ్ల జైలు శిక్ష, అత్యధికంగా 2,50,000డాలర్ల జరిమానా పడుతుంది. ఇ-మెయిల్ మోసంలో దోషిగా తేలితే 20ఏళ్ల జైలు శిక్ష పడనుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







