క్యాలీ ఫ్లవర్ పువ్వు రసాన్ని తీసుకుంటే అవి తగ్గిపోతాయ్...
- November 03, 2018
మనం కొన్ని పదార్థాలు ఇష్టంగా తింటాం. కొన్ని పదార్థాలు నచ్చక వదిలేస్తాము. కానీ ఆ నచ్చని పదార్థాలలో మన ఆరోగ్యానికి సంబంధించిన చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. అలాంటప్పుడు అవి నచ్చకపోయినా మనకు నచ్చే రీతిలో తయారుచేసుకుని మన ఆరోగ్యం కోసమైన తినాల్సి ఉంటుంది. అలాంటి వాటిల్లో కాలీఫ్లవర్ ఒకటి. కాలీఫ్లవర్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వండేటప్పుడు దాని వాసన అంత బాగుండదు. కానీ కాస్త మసాలా దట్టించి వండితే అద్భుతమైన రుచిని చూడవచ్చు. కాలీప్లవర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తాజా పువ్వు రసాన్ని ప్రతిరోజూ ఒక కప్పు చొప్పున రెండుమూడు మాసాల పాటు సేవిస్తుంటే పొట్టలో కురుపులు, దంతాలు, చిగుళ్ల నుండి రక్తస్రావం లాంటివి తగ్గిపోతాయి.
2. కాలిఫ్లవర్‌ని తీసుకోవడం వల్ల లంగ్, బ్రెస్ట్, ఒవేరియన్, ఇంకా బ్లాడర్ క్యాన్సర్ వంటి పలు క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
3. కాలిఫ్లవర్ ఆకుల రసం రోజూ ఒక కప్పు స్వీకరిస్తుంటే రేచీకటి, చర్మం పొడిపొడిగా ఉండటం, జుట్టు త్వరగా తెల్లబడటం, జలుబు నివారించబడతాయి.
4. గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ కాలిఫ్లవర్ పువ్వు ఆకుల రసం సేవిస్తుంటే పిండం ఆరోగ్యంగా ఉండి, వెంటవెంటనే గర్భధారణ కాకుండా ఉంటుంది.
5. కాలిఫ్లవర్‌లో ఉండే రసాయనాలు క్యాన్సర్ బారి నుండి దూరంగా ఉంచడమే కాకుండా మన కాలేయం పనితీరును కూడా క్రమబద్ధం చేస్తుంది. కాలిఫ్లవర్‌లో ఉండే గ్లూకోసినోలేట్స్, ధయోసయనేట్స్ లివర్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రుమటాయిడ్ ఆర్ధరైటిస్ నుండి రక్షణనిస్తుందని పరిశోధనలు తేల్చాయి.
6. స్త్రీలకు అతి ముఖ్యమైన విటమిన్ B కాలిఫ్లవర్ ద్వారా పుష్కలంగా లభిస్తుంది. గర్బిణీ స్త్రీలయితే ఖచ్చితంగా కాలిఫ్లవర్ తీస్కోగలిగితే వాళ్లకు డెలివరీ టైమ్‌లో కావలసిన శక్తి లభిస్తుంది. కాలిఫ్లవర్‌లో విటమిన్ సి కాల్షియమ్ కూడా లభిస్తాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







