మళ్లీ కేరళలో టెన్షన్ వాతావరణం...

- November 04, 2018 , by Maagulf
మళ్లీ కేరళలో టెన్షన్ వాతావరణం...

కేరళ : మళ్లీ టెన్షన్...టెన్షన్...అయ్యప్పను దర్శించుకుంటామని మహిళలు..అడ్డుకుంటామని ఇతరుల హెచ్చరింపులు..దీనితో మరోసారి కేరళ రాష్ట్రంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల్ని అనుమతించాల్సిందేనని.. అనుమతించకపోవటం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును పలువురు వ్యతిరేకించారు. ఇటీవలే తెరిచిన ఆలయం వద్దకు అయ్యప్పను దర్శించుకొనేందుకు వచ్చిన మహిళలు ఆందోళనకారులు అడ్డుకున్నారు. తెరిచిన రోజుల్లో ఏ ఒక్క మహిళ దర్శనం చేసుకోలేదు. తాజాగా సోమవారం ఆలయం తెరుచుకోనుంది. 
దీనితో అక్కడి రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. నీలక్కల్ నుండి పంబా వరకు పలు ఆంక్షలు విధించారు. మహిళలు రాకుండా హిందూ సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. శబరిమల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. దాదాపు రెండు వేల మంది పోలీసులు మోహరించడంతో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కేవలం 9గంటల పాటు ఆలయాన్ని తెరచి ఉంచనున్నారు. స్వామిని దర్శించుకునేందుకు 10 నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారు ఇప్పటికే శబరిమలకు బయలుదేరినట్లు సమాచారం. 
ఈ సందర్భంగా పోలీసులు పలు ఆదేశాలు జారీ చేశారు. భక్తులు గుమికూడి ఉండవద్దని హెచ్చరించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కాప్స్ హెచ్చరించారు. ఇందులో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com