అబుదాబీ ఎయిర్‌పోర్ట్‌లో 3 కొత్త బ్రిడ్జ్‌లు

- December 21, 2015 , by Maagulf
అబుదాబీ ఎయిర్‌పోర్ట్‌లో 3 కొత్త బ్రిడ్జ్‌లు

అబుదాబీ ఎయిర్‌పోర్ట్‌లో మూడు కొత్త బ్రిడ్జ్‌లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 106 బ్రిడ్జ్‌లను అందుబాటులోకి తీసుకురానుండగా, అందులో మూడు బ్రిడ్జ్‌ల ఇన్‌స్టలేషన్‌ పూర్తయ్యింది. మోడిఫైడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌లో ఈ మూడు బ్రిడ్జ్‌లను ఇన్‌స్టాల్‌ చేశారు. ప్రయాణీకులను ఈ బ్రిడ్జ్‌లు ఆకట్టుకుంటాయని, టెర్మినల్‌ నిర్మాణంలో ఇది ముఖ్యమైన ఘట్టమని అబుదాబీ ఎయిర్‌పోర్ట్స్‌ ఛైర్మన్‌ అలి మాజెద్‌ అల్‌ మన్సూరి చెప్పారు. మోడిఫైడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ బ్రిడ్జ్‌ల ప్రాజెక్ట్‌లో 24 బ్రిడ్జ్‌లను జర్మన్‌ తయారీ సంస్థ తిస్సెన్‌క్రప్‌ తయారుచేసి, అందజేసిందని, మిగతా బ్రిడ్జ్‌లను కూడా త్వరలో ఇన్‌స్టాల్‌ చేస్తామనీ, ఎనిమిది బ్రిడ్జ్‌లు ప్రత్యేకంగా ఎయిర్‌బస్‌ 380 అప్పర్‌ డెక్‌లోకి ప్రయాణీకుల్ని సరాసరి చేరవేసేందుకుగాను డిజైన్‌ చేయబడ్డాయని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com