డాక్టర్ల అరుదైన ప్రయోగం:ఇద్దరు అమ్మాయిలకు మగబిడ్డ పుట్టాడు

- November 04, 2018 , by Maagulf
డాక్టర్ల అరుదైన ప్రయోగం:ఇద్దరు అమ్మాయిలకు మగబిడ్డ పుట్టాడు

టెక్సాస్: అసహజ శృంగారానికి పాల్పడే గే, లెస్బియన్ వంటి స్వలింగ సంపర్కులకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఇది అసాధ్యం. కానీ ఈ అసాధ్యాన్ని ఓ లెస్బియన్ జంట సుసాధ్యం చేసింది. ఓ బిడ్డకు జన్మను ఇచ్చింది. ఈ వింత సంఘటన నార్త్ టెక్సాస్‌లో జరిగింది.
బ్లిస్ కౌల్టర్, అష్లేయిగ్ కౌల్టర్ అనే ఇధ్దరు అమ్మాయిలు కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం అంటే 2015లో వారు వివాహం కూడా చేసుకున్నారు. ఇద్దరు స్వలింగ సంపర్కులే కావడంతో పిల్లలు కనడం అసాధ్యమే. కానీ బ్లిస్ కౌల్టర్‌కు పిల్లలు కావాలని ఉండేది.
కానీ కేవలం పురుషుడి గర్భం ద్వారా గర్భం దాల్చడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. తన భాగస్వామి అష్లేయిగ్ ద్వారానే పిల్లలు కావాలని గట్టిగా పట్టుబట్టింది. తాము ఇద్దరం యువతులం అయినప్పటికీ, తమ ఇద్దరి ద్వారా కలిగే సంతానమే కావాలని బలంగా కోరుకుంది.
దీంతో ఇరువురు డాక్టర్లను సంప్రదించారు. పిల్లలు పుట్టే అవకాశాలపై చర్చించారు. వారి కోరికను విన్న డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కానీ పిల్లలు పుట్టే అవకాశం మాత్రం ఉంటుందని డాక్టర్లు వారికి చెప్పారు. దీంతో బిల్స్ కౌల్టర్, అష్లేయిగ్‌లు అందుకు సిద్ధపడ్డారు.
వారిద్దరి నుంచి శుక్రకణాలను సేకరించారు. ఓ పురుషుడి వీర్య కణాలతో జత చేసి ఫలదీకరణం చేశారు. అండాన్ని రూపొందించారు. ఈ పిండాన్ని బ్లిస్ గర్భాషయంలో ఐదు రోజుల పాటు ఉంచి, ఆ తర్వాత అష్లేయిగ్ గర్భాశయంలోనూ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మగబిడ్డకు జన్మనిచ్చారు. వీరిద్దరికి పుట్టిన బిడ్డకు స్టేటాన్స్ అని పేరు పెట్టారు. ఇందుకోసం వారు దాదాపు రూ.ఆరు లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఈ బాబు ఈ ఏడాది జూన్‌లో పుట్టాడు. పుట్టినప్పుడు అతను చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఎనిమిది పౌండ్ల బరువు ఉన్నాడు. ఇది మెడికల్ హిస్టరీయే. డాక్టర్లు అరుదైన ప్రయోగం ద్వారా దీనిని సాధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com