రివ్యూ:సర్కార్

రివ్యూ:సర్కార్

స్టార్ కాస్ట్ : విజయ్‌, కీర్తిసురేశ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ తదితరులు..
దర్శకత్వం : ఎ.ఆర్‌.రెహమాన్‌
నిర్మాతలు: అశోక్ వల్లభనేని
మ్యూజిక్ : ఎ.ఆర్‌.రెహమాన్‌
విడుదల తేది : నవంబర్ 06, 2018 
రివ్యూ : సర్కార్ - రొటీన్ పొలిటికల్ డ్రామా..

విజయ్ - కీర్తి సురేష్ జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సర్కార్'. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. దీపావళి కానుకగా ఈరోజు ( నవంబర్ 6న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనే లేదు. గతంలో విజయ్, మురుగదాస్ కాంబినేషన్‌లో 'తుపాకి', 'కత్తి' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో లో సినిమా వస్తుండడం తో ఈ సినిమా కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందని విజయ్ అభిమానులు ధీమా వ్యక్తం చేసారు. మరి వారి ధీమాకు తగినట్లు సినిమా ఉందా..? మురుగదాస్ - విజయ్ కాంబో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేసిందా..? అసలు సర్కార్ కథ ఏంటి..? అనేది ఇప్పుడు పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

సుందర్‌ రామస్వామి (విజయ్‌) ప్రపంచంలోనే నెంబర్ వన్ అయిన జి.ఎల్ కార్పొరేట్ కంపెనీకి సి.ఇ.ఒగా వర్క్ చేస్తుంటారు. ఏడాదికి కోట్లు సంపాదించే గొప్ప బిజినెస్ మాన్. ఈయన పేరు చెపితే చాలు కార్పోరేట్‌ సంస్థలన్నీ వణికిపోతుంటాయి. సుందర్ ఏ దేశంలో అడుగుపెట్టిన అక్కడి కంపెనీలను దెబ్బతీసి, వాటిని మూసేయించే టాలెంట్ బిసినెస్ మాన్. అలాంటి ఆయన భారత్‌కు వస్తుండన్నా సమాచారంతో ఇక్కడి కార్పోరేట్ కంపెనీలన్ని ఖంగారు పడతాయి. వరల్డ్ బిజినెస్ మాన్ భారత్ కు రావడం ఏంటి దానికి కారణం ఏంటి..ఇక్కడి సంస్థలన్నిటిని కొనుగోలు చేయడానికే వస్తున్నాడా..అనే అనుమానాలు అందరిలో కలుగుతాయి. కానీ సుందర్ ఇండియా కు రావడానికి కారణం తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి. ఈ విషయం తెలిసి అంత హమ్మయ్య అనుకుంటారు.

ఇక తీరా ఓటు వేద్దామని పోలింగ్ బూతుకు వెళ్లేసరికి తన ఓటును వేరే వారు వేశారని తెలుస్తుంది. దీంతో తన ఓటు కోసం కోర్టును ఆశ్రయిస్తాడు. సుందర్‌ ఓటు హక్కు వినియోగించుకునే వరకు అక్కడ ఎలక్షన్‌ కౌంటింగ్ ఆగిపోతుంది. సుందర్‌ విషయం తెలిసి ఓటు వేయలేకపోయిన దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజులు అదే తరహాలో కేసుల వేస్తారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలనుకున్నపుణ్యమూర్తి..కోర్టు ఎన్నికలు రద్దు చేయడంతో కోపంతో ఊగిపోతాడు. గెలిచే టైంలో సుందర్ వచ్చి ఎన్నికల రద్దుకు కారణమయ్యాడని, ఎలాగైనా సుందర్ ని చంపాలని అనుకుంటాడు. ఈ విషయం సుందర్ కి తెలియడం సుందర్ ముఖ్యమంత్రి నిలబడే నియోజక వర్గంలోనే నిలబడి అతనిపై విజయం సాధిస్తానని సవాలు విసురుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? సుందర్ ఎన్నికల్లో గెలుస్తాడా లేడా..? కార్పోరేట్ క్రిమినల్‌గా పేరు తెచ్చుకున్న సుందర్‌, రాజకీయ కుట్రల మధ్య ఎలా నెగ్గుతాడు..? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు తెరపై సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* విజయ్ యాక్టింగ్

* సినిమాటోగ్రఫీ

* కథ మైన్ లైన్

మైనస్ :

* మ్యూజిక్

* లాజిక్‌ లేని సీన్స్‌

* డైరెక్షన్

నటీనటుల పెర్పామెన్స్ :

* విజయ్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. నటన పరంగానే కాక లుక్ విషయంలోనూ చాల జాగ్రత్తలు తీసుకున్నాడు. గతంలో ఎన్నడూ కనిపించనంత స్టైలిష్ లుక్‌ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇక యాక్షన్‌ సీన్స్‌లో విజయ్‌ పర్ఫామెన్స్‌ అదిరిపోయింది.

* మహానటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంటున్న కీర్తి సురేష్‌కు ఈ సినిమాలో ఏమాత్రం ప్రాదాన్యం లేని పాత్రలో కనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఒకటి రెండు సన్నివేశాలు తప్ప కీర్తి సురేష్ ఎక్కడా పెద్దగా కనిపించలేదు.

* వరలక్ష్మీ శరత్‌కుమార్‌ది సైతం చిన్న పాత్రే. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది.

* రాజకీయ నాయకుడి పాత్రలో రాధారవి మరోసారి తన అనుభవాన్ని చూపించారు. సీఎం పుణ్యమూర్తిగా కనిపించి ఆ పాత్రకు న్యాయం చేసారు.

* ఇక మిగతా నటి నటులు వారి వారి పాత్రల్లో బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

* మ్యూజిక్ డైరెక్టర్ రహమాన్ మరోసారి నిరాశ పరిచాడు. తన మ్యూజిక్ మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ సైతం ఆకట్టుకోలేకపోయింది. ఇక పాటలు సందర్భానుసారంగా రాకపోవడం కూడా ప్రేక్షకులను విసుగు తెప్పించాయి.

* గిరీశ్ గంగాధరన్‌ సినిమా ఫొటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది.

* శ్రీకర్ ప్రసాద్‌ ఎడిటింగ్ లోను లోపాలు కనిపించాయి. చాల సన్నివేశాలు స్లో గా సాగాయి.

* కళానిధి మారన్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి.

* మురుగదాస్ విషయానికి వస్తే..సామాజిక సమస్యలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తనదైన శైలిలో కమర్షియల్‌ఫార్మేట్‌లో సినిమాలను తెరకెక్కించడంలో మురుగదాస్ దిట్ట. సర్కార్ సినిమాలో కూడా ఓటు విలువను చెప్పే ప్రయత్నం చేసాడు. కానీ తాను అనుకున్న కథ లైన్ బాగున్నప్పటికీ దానిని తెర ఫై చూపించడంలో తడబడ్డాడు.

సన్నివేశాలను ఆసక్తికరంగా మలచలేకపోవడమే కాదు విజయ్ క్యారెక్టర్‌కున్న బిల్డప్‌కి, సన్నివేశాలకు, కథాగమనానికి సంబంధం లేకుండా చేసాడు. ఫస్టాఫ్ వరకు ఏదో మేజిక్ చేస్తాడు మురగదాస్ అని నమ్ముకున్న ఆడియెన్స్‌కు నిరాశే ఎదురైంది. విజయ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే పాయింట్ సినిమా సగంలోని పక్కదారి పట్టేసింది. అన్నింటికి రాజకీయాలే కారణం అనే రీతిలో సినిమా సాగుతుండడం ప్రేక్షకులకు విసుగు తెప్పించింది.

చివరిగా :

ఫస్ట్‌హాఫ్‌ యాక్షన్ సీన్స్‌, పొలిటికల్‌ పంచ్‌ డైలాగ్‌లతో సెకండ్ హాఫ్ ఫై ఆసక్తి కనపరిచిన, సెకండ్ హాఫ్ మొదలు కాగానే కథ మొత్తం పక్కకు వెళ్ళింది. పొలిటికల్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన సినిమాలో ఏ మాత్రం థ్రిల్లింగ్‌ సన్నివేశాలు లేకపోగా , కథనం సాధాసీదాగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్‌ లో వచ్చే సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి. ఓవరాల్ గా మురుగదాస్ - విజయ్ ల కాంబోలో వచ్చిన ఈ మూవీ హ్యాట్రిక్ అనిపించుకోలేకపోయింది. భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులకు నిరాశే ఎదురయ్యింది.

నోట్ :

సినిమాను థియేటర్స్ లలో చూడండి..పైరసీ చేసి సినిమా ఇండస్ట్రీని నాశనం చేయకండి. ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది కేవలం మన ఆనందం కోసమే..అలాంటి ఆనందాన్ని పైరసీ లో చూడకండి.

మాగల్ఫ్ రేటింగ్ : 2.25/5

Back to Top