భాగ్యనగరంలో ఆ రెండు గంట‌ల్లోనే ట‌పాసులు పేల్చాలి

భాగ్యనగరంలో ఆ రెండు గంట‌ల్లోనే ట‌పాసులు పేల్చాలి

హైదరాబాద్:దీపావళి రోజున టపాకాయిలు పేల్చడంపై సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది. కేవలం రెండు గంటలు మాత్రమే పేల్చాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాణాసంచా, ప‌టాకులను కాల్చడంపై జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో భారీ శ‌బ్దాలను క‌ల‌గ‌జేసే ట‌పాసులను పేల్చడాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. నగరవాసులు సుప్రీం ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. దీపావ‌ళి పండుగ రోజు రాత్రి 8గంట‌ల నుండి 10గంట‌ల‌లోపు మాత్రమే ట‌పాసుల‌ను కాల్చాల‌ని దాన‌కిషోర్ స్పష్టం చేశారు.

Back to Top