అంతరిక్షంలోకి మరో యూఏఈ శాటిలైట్!
- November 07, 2018
మైశాట్-1 పేరుతో యూఏఈకి చెందిన స్టూడెంట్స్ తయారు చేసిన నానో శాటిలైట్ ఈ నెలలోనే అంతరిక్షంలోకి వెళ్ళనుంది. గత నెలలో అంటే అక్టోబర్లో 29వ తేదీన దేశానికి చెందిన ఖలీఫా శాటిలైట్, జపాన్లోని ప్రయోగ కేంద్రం నుంచి ఆకాంశంలోకి దూసుకెళ్ళిన సంగతి తెల్సిందే. కాగా, 20 మంది విద్యార్థులు, మైశాట్-1 శాటిలైట్ని రూపొందించారు. ఖలీఫా యూనివర్సిటీకి చెందిన ఈ విద్యార్థులు తయారు చేసిన శాటిలైట్, భూమిని ఫొటోలు తీయనుంది. ప్రధానంగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం దీన్ని రూపొందించారు. నార్త్ట్రాప్ గ్రుమ్నాన్ సంస్థ తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్ ద్వారా మైశాట్-1 ఉపగ్రహాన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపిస్తారు. మైశాట్-1 బరువు 1.3 కిలోలు. మస్దార్ సిటీలోని యహ్శాట్ స్పేస్ ల్యాబ్లో దీన్ని రూపొందించారు. మస్దార్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసిన బ్యాటరీతోపాటు, కెమెరా ఇందులోని ప్రధాన భాగాలు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







