దీపావళి కానుగా 'అంతరిక్షం' పోస్టర్ రిలీజ్!
- November 07, 2018
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా అంతరిక్షం. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అంతరిక్ష నేపధ్యంలో సాగే ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది. లావణ్య త్రిపాఠి, అదితిరావు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్నారు.
హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్, అదితిరావు వ్యోమగాములుగా కనిపించనున్నారు. దసరా కానుకగా చిత్ర టీజర్ విడుదల కాగా, ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. దీపావళి సందర్భంగా సినిమా నుండి పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సంప్రదాయ గెటప్ లో దర్శనమిచ్చారు.వరుణ్ తేజ్ వైట్ అండ్ వైట్ కుర్తా పైజామాలో హుందాగా కనిపిస్తే.. లావణ్య లంగావోణీలో అందంగా కనిపిస్తోంది.
ఈ సినిమాను డిసంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఘాజీ చిత్రంలానే ఈ సినిమా భారీ హిట్ అవుతుందని టీం భావిస్తుంది. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు. వి.ఎస్. జ్ఞానశేఖర్ ఛాయా గ్రాహకుడు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి