దీపావళికి టపాసులు ఎందుకు కాల్చుతారో తెలుసా..!
- November 07, 2018
దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా వెలుగుల పండుగ చేసుకుంటున్నారు. చెడును అంతం చేసి మంచిని గెలిపించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అసలు దీపావళి ఎన్ని రోజులు చేసుకోవాలి? ఏ పండగకు లేని విశిష్టత దీపావళికే ఎందుకు? టపాసులు కాల్చాలన్న సంప్రదాయం ఎలా వచ్చింది?
హిందువుల ప్రముఖ పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపం దీప్తినిస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతికి అద్దం పడుతుంది. దీపావళి పండుగ ఆశ్వయుజ అమావాస్య నాడు వస్తుంది. అంతకుముందు రోజు నరక చతుర్దశి. వ్యాపారులు దీపావళి పర్వదినాన్ని నూతన సంవత్సరంగా భావిస్తారు. లక్ష్మీదేవికి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు.
నిజానికి దీపావళి మూడు రోజుల పండుగ. కొన్నిచోట్ల ఈ పండుగను ఐదురోజులు కూడా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఈ పండుగ మొదటిరోజు నరకచతుర్దశి, రెండోరోజు దీపావళి, మూడోరోజు బలిపాడ్యమిగా జరుపుకుంటారు. ఐదురోజులు పండుగ చేసుకునే వారు ధనత్రయోదశి, నరకచతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ జరుపుకుంటారు. జ్ఞానానికి, ఐశ్వర్యానికి, ఆనందానికి ప్రతీకగా నిలిచే జ్యోతి మహాలక్ష్మి స్వరూపం. అలాంటి దీపావళినాడు జ్యోతిని లక్ష్మీదేవిలా భావించి మహిళలు లక్ష్మీపూజ నిర్వహిస్తారు.
శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుని చంపిన తర్వాతి రోజు, ఆ రాక్షసుని పీడ విరగడైందన్న సంతోషంతో దీపావళి జరుపుకునే సంప్రదాయం వచ్చింది. శ్రీరాముడు, రావణాసురుని అంతం చేసి… సీతమ్మను తీసుకుని అయోధ్యకు వచ్చిన సందర్భంగా దీపావళి జరుపుకునే ఆచారం వచ్చిందని కూడా చెప్తుంటారు. మొత్తానికి చెడును రూపుమాపి… మంచిని మిగిల్చిన సందర్భంగా చీకటిని పారదోలుతూ దీపాలను వెలిగించి… విజయసూచకంగా టపాసులు మోగించే ఆచారం ఏర్పడింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి