చిన్నారి నోట్లో బాంబు పేల్చిన యువకుడు
- November 08, 2018
యూపీ:మనుషుల్లో మృగం నిద్రలేస్తున్నాడు. చిన్నారి నోట్లో సుతిలి బాంబు పేట్టి పేల్చాడు ఓ యువకుడు. ఈ దారుణమైన సంఘటన యూపీలోని మీరట్ జిల్లా మిలాక్ గ్రామంలో చోటు చేసుకుంది. నోట్లో బాంబు పెట్టుకుంటే పటాకులు కొనిస్తానని ఆ చిన్నారికి ఆశ చూపించి హర్‌పాల్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక నోట్లో బాంబు పేట్టి పేల్చడంతో పాప తీవ్రంగా గాయపడింది. దీంతో స్థానికులు హుటాహుటిన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు నోటికి దాదాపు 50కి పైగా కుట్లు వేశారు. చిన్నారి అత్యవసర విభాగంలో చికత్స పోందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితుడు పరారీలో ఉన్నాడు. బాలిక తండ్రి సుశీల్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







