శీతాకాలం... అల్లం ఉపయోగాలు

- November 09, 2018 , by Maagulf
శీతాకాలం... అల్లం ఉపయోగాలు

వర్షాకాలం మరియు చలి కాలాలలో, తరచుగా గాలిలో చురుకుగా ఉన్న సూక్ష్మజీవుల కారణంగా అనారోగ్యాలు తలెత్తడం సర్వసాధారణం. క్రమంగా, జలుబు మరియు ఫ్లూ వంటి సమస్యలను ఎదుర్కొనడానికి సరైన రోగనిరోధక పనితీరును నిర్వహించడం కష్టతరం అవుతుంది. 
 
ఆహారంలో అల్లం కలిపి తీసుకోవడం అలవాటుగా ఉంటే, ఇటువంటి సూక్ష్మజీవులు వీలైనంత వరకు తగ్గుముఖం పడుతాయి. అల్లం ఒక యాంటీమైక్రోబయాల్ ఏజెంట్‌లా పనిచేస్తుంది, అనగా అంతర్గత మరియు బాహ్య ప్రభావిత బ్యాక్టీరియాను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అల్లం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. అల్లం జీవక్రియలను పెంపొందించడంలో ఉత్తమ ప్రభావాలను కలిగి ఉంటుందని ఆహార నిపుణులు సూచిస్తుంటారు. అల్లం మరియు నిమ్మకాయలు కలిపినప్పుడు, అది మీ జీవక్రియలను పెంచడంలో సహాయం చేస్తుంది. 
 
2. బరువు పెరగాలనుకునే వారికి కడుపులో మరింత యాసిడ్ ఉత్పత్తి చేయడం ద్వారా ఆకలిని ప్రేరేపించగల లక్షణాలు అల్లంలో ఉంటాయి. క్రమంగా జీవక్రియలు పెరుగుతాయి.
 
3. బరువు తగ్గాలని భావిస్తున్నవారికి కూడా అల్లం ఉపయోగకరంగా ఉంటుంది. కడుపు లోపలి ఆమ్లం జీవక్రియలపై ప్రభావాన్ని చూపుతాయి, ఇవి మరిన్ని కేలరీలను మరియు కొవ్వులను దహించేలా సహాయం చేస్తుంది.
 
4. రాత్రి సమయాల్లో నిమ్మరసం మరియు అల్లం రసం త్రాగడం ద్వారా మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా సహాయం చేస్తుంది. నిమ్మ రసం మూత్రంలో సిట్రేట్ స్థాయిలను పెంచుతుంది, ఇది మూత్రపిండాల్లో ఏర్పడే కాల్షియం రాళ్ళను విచ్ఛిన్నం చేయడం లేదా నివారించడంలో సహాయపడుతుంది. ఈ కాల్షియం రాళ్ళనే మూత్రపిండంలో రాళ్ళుగా సూచించబడతాయి.
 
5. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నప్పుడు వర్షాకాలం మరియు శీతాకాలం సమయాలలో అల్లం మరియు నిమ్మరసం ఎంతో సహాయకంగా ఉంటుంది. దగ్గు, జలుబు, గొంతు సమస్యలతో ఇబ్బంది పడేవారు అల్లం, నిమ్మ టీలను తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com