దుబాయ్ లో మెగా రక్త దాన శిబిరం...
- November 10, 2018
దుబాయ్:47వ యూ.ఏ.ఈ నేషనల్ దినోత్సవం సందర్భంగా ఎఫ్.ఓ.ఐ ఈవెంట్స్ ఆధ్వర్యంలో దుబాయ్ లో మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు.ఈ శిబిరం కు పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల వలస కార్మికులు రక్త దానం చేయడం కోసం ముందుకొచ్చారు.ఈ సందర్బం గా మన తెలంగాణ రాష్ట్రం నిజామాబాదు జిల్లా రాంపూర్ కు చెందిన వలస కార్మికుడి తో మా ప్రతినిధి ఈ రక్తదాన శిబిరం గురించి వివరణ కోరగా ఆయన మాటల్లో నేను ఒక్క సామాన్యుడిని నేను ఒక్క పేద ఇంటి నిరుద్యోగిని పొట్ట బట్టకయి కానరాని దేశంలో ఎడారి బాటలో నా జీవనం ప్రయాణం కొనసాగిస్తూ జీవితం వెళ్లదీస్తున్నకాలం గడిచి పోతుంది.నాకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు కానుకలు ఇవ్వడానికి, ఉన్నదొకటే జిందగీ నా జిందగీలో ఒక్కరి ప్రాణం కాపాడటానికి నేను ఇవ్వగల నా ఆస్తి నా రక్తం ఒక్కరి జీవితం ఒక్క కుటుంబములో వెలుగులు నింపడమే నా లక్ష్యం ఆ లక్ష్యంలో నేను ముందడుగు వేసి ఈ రోజు తో 6 వ సారి రక్తదానం చేసి ఎడారి దేశంలో రక్తదాతగా నిల్చిన సందర్భంగా జంగం బాలకిషన్ మాట్లాడుతూ అత్యవసర సమయంలో ఆదుకోవడమే నా జీవిత గమనం అని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







