భారతీయుడు 2 లో కనిపించనున్న సల్మాన్
- November 10, 2018
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'భారతీయుడు' చిత్రం ఎలాంటి సంచలన విజయం సాధించిందో తెలియంది కాదు..తమిళ్ , తెలుగు భాషల్లో రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరవాత ఈ సినిమాను సీక్వెల్ తెరకెక్కిందామని అనుకున్నారు కానీ అది కుదరలేదు. మళ్లీ ఇంత కాలానికి దీనికి సీక్వెల్ తెరపైకి వచ్చి అభిమానుల్లో ఆసక్తి పెంచుతుంది. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇక ఈ మూవీ లో ఓ కీలక పాత్రలో మహానటి ఫేమ్ సల్మాన్ దుర్క్యూర్ నటిస్తున్నట్లు సమాచారం. తెలుగులో మహానటి సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న సల్మాన్ , అంతకు ముందు ఓకే బంగారం సినిమాతో తెలుగు తెరపై కనిపించాడు. ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా నయనతార పేరు వినిపిస్తోంది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ను ఖరారు చేయగా , ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







