ఆర్.ఆర్.ఆర్ ఓపెనింగ్..
- November 11, 2018
హైదరాబాద్:బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈరోజు ముహుర్త కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓపెనింగ్ నాడే సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు రాజమౌళి.
చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి క్లాప్ కొట్టగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు. ఇక ఓపెనింగ్ ఈవెంట్ లో సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ కూడా అటెండ్ అవడం విశేషం. ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి చేస్తున్న ఈ మూవీపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
ఇక ఓపెనింగ్ లో మరో సర్ ప్రైజ్ ఏంటంటే బాహుబలి ప్రభాస్, భళ్లాలదేవ రానా ఈ ఈవెంట్ కు ఎంట్రీ ఇచ్చారు. బాహుబలి సినిమాతో రాజమౌళి, ప్రభాస్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ రాజమౌళి కోసం ఈ ఈవెంట్ కు వచ్చాడు. ఎన్.టి.ఆర్, రాం చరణ్, ప్రభాస్, రానా నలుగురు స్టార్స్ ఒకే చోట్ల కలిసి తమ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు.
ఇక ముహుర్త కార్యక్రమానికి ప్రభాస్, రానా రావడంపై ఈ సినిమాలో రానా కూడా నటిస్తున్నాడన్న వార్తలు మొదలయ్యాయి. ఆర్.ఆర్.ఆర్ అంటే రామ రావణ రాజ్యం అనే టైటిల్ కూడా ప్రచారం జరుగుతుంది. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్న ఈ ట్రిపుల్ ఆర్ సినిమా 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి