శబరిమలై వెళ్లే భక్తులకు శుభవార్త
- November 11, 2018
కేరళ:శబరిమలై వెళ్ళే రాష్ట్ర భక్తులకు శుభవార్త... పంబ తీరాన గల నీల్‌కల్‌లో ఆర్టీసీ బస్సుల పార్కింగ్, సమాచార కేంద్రం ఏర్పాటుకు కేరళ ప్రభుత్వం అనుమతించింది. గత నాలుగు రోజులుగా ఏపీకి చెందిన ఆర్టీసీ అధికారులు కేరళ రాష్ట్ర మంత్రులతో జరిపిన మంతనాలు ఫలించాయి. దీనిపై ఆర్టీసీ సిబ్బంది, అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలనుండి వేలాది మంది భక్తులు ఆర్టీసీ బస్సులు కిరాయికి మాట్లాడుకుని వెళుతుంటారు. ఈ వాహనాలకు నిర్ధారిత పార్కింగ్ స్థలం లేదు. దీంతో భక్తులు స్వామివారిని దర్శించుకొని తిరిగివచ్చే సమయానికి తాము వచ్చిన బస్సు ఎక్కడుందో తెలియక, డ్రైవర్ అందుబాటులో లేక పడరానిపాట్లు పడేవారు. ఇప్పుడిక ఆ కష్టాలు తీరనున్నాయి.
విజయవాడలోని ప్రధాన కార్యాలయం సీటీఎం బ్రహ్మానందరెడ్డి, చిత్తూరు డిప్యూటీ సీటీఎం రాము నాలుగు రోజుల క్రితం కేరళ రాష్ట్రానికి వెళ్ళి ఏపీ నుండి వచ్చే ఆర్టీసీ బస్సులకు పార్కిం గ్ స్థలానికి, డ్రైవర్ల విశ్రాంతి గది, విచారణ కేంద్రం, సుమారు 50 బస్సులు ఉండేందుకు పార్కింగ్ స్థలం కావాలని వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన కేరళ మంత్రులు, అధికారులు వీరి విన్నపాన్ని స్వీకరించి నీల్‌కల్ వద్ద బస్సుల పార్కింగ్, విచారణ కేంద్రం, డ్రైవర్ల విశ్రాంతి గదులకు అనుమతిస్తూ స్థలాన్ని కేటాయించా రు. ఆర్టీసీ యాజమాన్యం చిత్తూరు డివిజన్ పరిధిలో ఉన్న ఏడు డిపోలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు,గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అయ్య ప్ప భక్తులను స్వయంగా కలిసి ఆర్టీసీలో ప్రయాణిస్తే కలిగే లాభాలు, వసతులపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు చిత్తూరు 1,2 డిపోలకు చెందిన 54బస్సులను అయ్యప్ప భక్తులు శబరిమలైకి బుక్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







