నటుడు ఉదయ్ కిరణ్‌పై పీడీ యాక్ట్ నమోదు
- November 11, 2018
ఫుల్‌గా మందేసి, మరోసారి పోలీసులకు చిక్కాడు యువనటుడు, ఉదయ్ కిరణ్. గతంలో మాదాపూర్ దస్‌పల్లా హోటల్‌లో సిబ్బందితో గొడవ పెట్టుకుని, ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటనలో ఒకసారి, మత్తు పదార్దాలు తీసుకున్న నేపథ్యంలో మరోసారి ఉదయ్ పోలీసులకు చిక్కాడు. ఈ మధ్య ఒక ఇంటి అద్దె విషయంలో దౌర్జన్యం చేసినందుకుగానూ ఇతడిపై కేసు నమోదైంది. నిన్న రాత్రి, తన ఫ్రెండ్ అను గుప్తాతో కలిసి, అర్ధరాత్రి వరకూ మందేసి, చిందేసిన ఉదయ్.. మాదాపూర్ పీఎస్ సర్కిల్ దగ్గర తన కారుతో నిఖిల్ అనే వ్యక్తి కారుని గుద్దాడు. మాటా మాటా పెరిగి, ఇద్దరూ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్ళారు. అక్కడ మందేసిన మత్తులో, కానిస్టేబుల్ ముందే నిఖిల్‌ని కొడుతూ, ఆపబోయిన కానిస్టేబుల్‌ని కూడా తోసేసాడు. ఈలోగా ఖాళీగా ఉండి ఏం చెయ్యాలి అనుకుందో అతగాడి ఫ్రెండ్, కంప్యూటర్ బద్దలు కొట్టడమే కాకుండా, రికార్డులన్నిటినీ చించిపారేసిందట. వాళ్ళని దారిలోకి తెచ్చే సరికి పోలీసులకు తల ప్రాణం తోకకి వచ్చినంత పనైందట. గతంలో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించిన ఉదయ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







