దుబాయ్ లో 'దీపావళి ధూమ్ ధామ్'
- November 11, 2018
దుబాయ్:దీపావళి సంబరాలను 'దీపావళి ధూమ్ ధామ్' పేరిట దుబాయ్ లోని 'అల్ కూస్' లోని ‘Dulsco Arena' లో గల్ఫ్ ప్రవాసియ సంక్షేమ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TPCC కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మధు యాష్కీ, గల్ఫ్ కన్వీనర్ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తమ మానిఫెస్టోలో చేర్చిన 'తెలంగాణ గల్ఫ్ పాలసీ' ను గల్ఫ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించి, TRS ప్రభుత్వం గల్ఫ్ సోదరులను ఆదుకోవడంలో విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ సోదరులని దృష్టిలో పెట్టుకొని ఈ పాలసీని రూపొందించిందని వివరించారు.జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గల్ఫ్ బిడ్డల క్షేమమే కాంగ్రెస్ ప్రధమ బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమానికి ఆసమ్ ఈవెంట్స్ వారు మరియు ఎస్.వి రెడ్డి,సుమంత్ రెడ్డి మంద తగిన ఏర్పాట్లు చేసారు.






తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







