సోషల్ మీడియా అకౌంట్స్‌పై దుబాయ్ పోలీస్ వార్నింగ్
- November 12, 2018
ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తనను తాను ప్రముఖుడిగా పరిచయం చేసుకుని, ఓ వృద్ధురాలి నుంచి డబ్బుని లాగేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయనీ, సోషల్ మీడియాలో ఇలాంటి అపరిచిత వ్యక్తుల్ని నమ్మి మోసపోకూడదని దుబాయ్ పోలీస్ అప్రమత్తం చేసింది. స్కామర్స్కి సోషల్ మీడియా చాలా బాగా ఉపయోగపడ్తోందనీ, అపరిచిత వ్యక్తులు చెప్పే తియ్యటి మాటలు అమాయకుల్ని నిండా ముంచేస్తున్నాయని పోలీసులు చెప్పారు. అపరిచిత వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో కనుగొనగానే తమను సంప్రదించాలని దుబాయ్ పోలీసులు అంటున్నారు. సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సలీమ్ బిన్ సల్మీన్ మాట్లాడుతూ, సోషల్ మీడియా వినియోగదారులు అనుక్షణం అప్రమత్తంగా వుండాలని సూచించారు. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగరాదనీ, పోలీసులను సంప్రదించి అక్రమార్కుల సమాచారం తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..