అగ్ని ప్రమాదం: ఇద్దరి మృతి, ముగ్గురికి గాయాలు
- November 12, 2018
షార్జాలోని ఓ విల్లాలో జరిగిన అగ్ని ప్రమాదం ఇద్దర్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. షార్జా మే సెలూన్‌లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే షార్జా సివిల్ డిఫెన్స్, సంఘటనా స్థలానికి ఫైర్ ఫైటర్స్‌నీ, రెస్క్యూ యూనిట్స్‌నీ పంపించడం జరిగింది. కేవలం ఐదు నిమిషాల్లోనూ సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడ్డ ఆసియా మహిళ, ఆమె చిన్నారికి వెంటనే వైద్య సహాయం అందించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా వుంది. సమాన్ అలాగే అల్ మినా నుంచి కూడా ఫైర్ ఫైటర్స్, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన ఇంట్లో 30 మంది వరకు నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







