ఇంటర్ అర్హతతో ఏపీ పోలీస్ శాఖలో ఉద్యోగాలు..
- November 13, 2018
ఏపీ పోలీస్ శాఖలో 2723 కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, ఫైర్‌మెన్, వార్డర్స్ కేటగిరిలో ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అర్హత: ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన విద్యార్హత
వయసు: 2018 జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: డిసెంబరు 7
ప్రిలిమినరీ రాత పరీక్ష: జనవరి 6. ఈ పరీక్ష పాసైన వారికి రెండో వారంలో దేహ దారుడ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష నిర్వహిస్తారు. మార్చినెల మొదటి వారంలో తుది రాత పరీక్ష నిర్వహిస్తామని డీజీపీ ఠాకూర్ వెల్లడించారు.
ప్రిలిమినరీ రాత పరీక్ష 200 మార్కులకు, తుది రాత పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.
గతంలో ముందు దేహదారుడ్య పరీక్ష్నిర్వహించేవారు. తాజా సవరణల ప్రకారం తొలుత రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. మళ్లీ కొత్తగా 5 కిలోమీటర్ల రన్నింగ్ రద్దు, క్వాలిఫయింగ్ ఈవెంట్స్‌ను 5 నుంచి మూడింటికి పరిమితం చేయడం లాంటి సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







