ప్రభుత్వ ఎయిర్‌లైన్సకు బెయిల్‌ఔట్ ప్యాకేజి - పాకిస్తాన్
- November 14, 2018
ఇస్లామాబాద్: నగదు సంక్షోభంలో కూరుకునిపోయిన పాకిస్తాన్‌ప్రభుత్వం ఆదేశంలోని అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొనేందుకుగాను రూ.1700 కోట్ల బెయిల్‌ఔట్ ప్యాకేజిని ఆమోదించింది. ప్రభుత్వం ముందురోజే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు వచ్చే రెండునెలల్లో ఈ ప్యాకేజిని అందించడం దావరా నష్టాలనుంచి బైటపేందుకు నిర్ణయించింది. ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణస్వీకారంచేసిన తర్వాత ఇదేమొదటినిర్ణయంగా చెపుతున్నారు. పౌరవిమానయాన రంగానికి ఇమ్రాన్‌ఖాన్ ఇన్‌చార్జిగా ఉన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర ఆర్ధికసంక్షోభం ఎదుర్కొంటున్నది. ఎనిమిది బిలియన్ డాలర్లను ప్యాకేజిని ఐఎఎంఫ్‌ను కోరింది. దేశంలో తలెత్తినచెల్లింపుల సంక్షోభాన్ని అధిగమించేందుకు ఐఎంఎఫ్ ప్యాకేజి ఒక్కటే శరణ్యమని తెలుస్తోంది. ఆర్ధిక సమన్వయ కమిటీ ప్రకారంచూస్తే ఆర్ధిక మంత్రి అతద్ ఉమార్ సోమవారం 1720 కోట్ల ప్యాకేజిని ప్రకటించారు. పిటిఐ ప్రభుత్వం ఇపుడు గత ప్రభుత్వం అంటే నవాజ్‌షరీఫ్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ విధానాలనే అనుసరిస్తున్నదని ఇలాంటి బెయిల్‌ఔట్‌ప్యాకేజిల ద్వారానే ఐదేళ్లనుంచి ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కొనసాగేటట్లు చేస్తోంది. ఇపుడు ఎయిర్‌లైన్స్ ప్యాకేజిని వాణిజ్యబ్యాంకులనుంచి సమకూరుస్తుంది.
ఇందుకు ఆర్ధికశాఖ హామీనిస్తుంది. ఇసిసి గ్యారంటీ పరిమితిని రూ.21.2 కోట్లకు పెంచిందని ఆర్ధికశాఖ అధికారులు ప్రకటించారు. ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఎయిర్‌మార్షల్ అర్షద్‌మాలిక్‌ను సిఇఒగా నియమించారు. అయితే మాలిక్ అనుభవంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఒక వాణిజ్య విమాన సంస్థను నిర్వహించడం అంటే సుదీర్ఘ అనుభవం ఉండాలని తేల్చారు. అదనంగా 19.5 కోట్ల సావరిన్ గ్యారంటీలు ఆర్ధిక మంత్రిత్వశాఖ ఇప్పటివరకూ 4.08 కోట్లు చేకూర్పును అందించింది. తాజా పెట్టుబడులతో మొత్తం బెయిల్‌ఔట్ ప్యాకేజి 25.3 కోట్ల రూపాయలకు చేరింది. అధికారంలోనికి వచ్చినవెంటనే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌సంస్థనుప్రైవేటీకరించకుండా బెయిల్ ఔట్‌ప్యాకేజితో ఆదుకునే యత్నాలుచేస్తోంది. ఎయిర్‌లైన్స్ ఏళ్లతరబడి నష్టాల్లో కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







