ప్రత్యేక దేశం కావాలంటున్న అఫ్రిది
- November 14, 2018
మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది తన నోటికి పనిచెప్పాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయినా ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటాడు. తాజాగా అఫ్రీది చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ కార్యక్రమాన్ని పురస్కరించుకొని బ్రిటిష్ పార్లమెంట్ లో విద్యార్ధులతో ముచ్చటించిన అఫ్రీది..కశ్మీర్ ను వదిలేయండి. నాలుగు ప్రావిన్స్ లనే సరిగా చూసుకోలేని మీకు కశ్మీర్ ఎందుకు. ఉన్న దేశంలో శాంతిభద్రతల్ని కాపాడాలంటూ పాక్ ప్రభుత్వానికి హితువు పలికాడు.
అంతేకాదు కశ్మీర్‌ను ఇండియాకు కూడా ఇవ్వొద్దని, లోయలో ప్రజలు చనిపోవడం తనను ఎంతగానో బాధిస్తోందని అఫ్రిది అన్నాడు. పాకిస్థాన్‌కు కశ్మీర్ అవసరం లేదు. అలాగని ఇండియాకు కూడా దానిని ఇవ్వొద్దు. కశ్మీర్ ప్రత్యేక దేశం కావాలి. అఫ్రీది చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. పలువురు నెటిజన్లు అతనిపై విమర్శలు కురిపిస్తున్నారు. సొంత దేశంపై విమర్శలు చేస్తున్న అఫ్రీది ఇలా మాట్లాడే అర్హత లేదని అంటున్నారు నెటిజన్లు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







