గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి నిరసన..ఇజ్రాయిల్ రక్షణ మంత్రి రాజీనామా
- November 14, 2018
జెరూసలేం : గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి నిరసనగా ఇజ్రాయిల్ రక్షణ మంత్రి అవిగ్డార్ లైబర్‌మన్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. 'భయానికి లొంగిపోవడం' గా ఈ ఒప్పందాన్ని ఆయన అభివర్ణించారు. ఈ చర్య ప్రధాని నెతన్యాహు ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. 'నేను అధికారంలో వుంటే దక్షిణ ప్రాంత ప్రజలు పడే ఇబ్బందులను చూడలేను.' అని ఆయన విలేకర్లతో వ్యాఖ్యానించారు. పాలస్తీనా రాకెట్ దాడులను ఎదుర్కొంటున్న ఇజ్రాయిలీలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. నెతన్యాహుకు లాంఛనప్రాయంగా రాజీనామా లేఖను అందచేశానని, 48గంటల్లోగా అమల్లోకి వస్తుందని చెప్పారు. నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వం నుండి ఆయన పార్టీ కూడా వైదొలగింది. వచ్చే ఏడాది ఇజ్రాయిల్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో 120సీట్లు గల పార్లమెంట్‌లో నెతన్యాహు బలం కేవలం 61కి పడిపోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలను నెతన్యాహు పార్టీ తోసిపుచ్చింది.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







