లక్ష రూపాయలు ఇస్తేనే శవాన్ని ఇస్తానన్న ఆశుపత్రి సిబ్బంది
- December 22, 2015
భాగ్యనగరంలో ఠాగూర్ సినిమా సీన్ కనిపించింది! ఓ ఆసుపత్రి యాజమాన్యం మరో లక్ష రూపాయలు ఇస్తేనే తన భర్త శవాన్ని ఇస్తామని చెబుతున్నారని ఓ మహిళ ఆరోపిస్తోంది. ఆమె పశ్చిమ బెంగాల్కు చెందిన మోమితగా చెబుతున్నారు. ఇప్పటి వరకు తన భర్త ఆరోగ్యం కోసం ఆసుపత్రికి రూ.5 లక్షలు కట్టానని, మరో లక్ష రూపాయలు ఇస్తేనే తన భర్త శవాన్ని ఇస్తామని చెబుతున్నారని భార్య ఆరోపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ డబ్బు కట్టలేక ఆమె హెచ్చార్సీని ఆశ్రయించింది. బాధితురాలు తన భర్తకు జైపూర్లో చికిత్స చేయించారు. అక్కడ పూర్తిగా నయం కాకపోవడంతో హైదరాబాదులోని ఆసుపత్రికి తీసుకు వచ్చారు. నాలుగు రోజుల క్రితం అతను చనిపోయాడు. అప్పటికే ఆమె రూ.5 లక్షలు చెల్లించినట్లుగా చెబుతోంది. ఇప్పుడు అతను చనిపోయాక కూడా మరో రూ.1లక్ష అడుగుతున్నారని చెబుతోంది. తమది ప్రేమ వివాహం అని, బంధువులు లేరని, తాను స్నేహితుల వద్ద అప్పు చేసి ఆ మొత్తాన్ని కట్టానని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్త శవం కోసం ఆమె నాలుగు రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







