గూగుల్ మ్యాప్స్‌లో ఆకర్షణీయమైన ఫీచర్
- November 15, 2018
కాలిఫోర్నియా: ఇప్పటిదాకా గూగుల్ మ్యాప్స్‌ను దారి చూపించే మార్గదర్శిగానే ఉపయోగిస్తున్నాం. దీనికి అదనంగా మరోకొత్త ఫీచర్‌ను గూగుల్ కలిపింది. ఇకపై రెస్టారెంట్‌కు దారితోపాటు అక్కడ ఉన్న మేనేజర్‌తో మాట్లాడి టేబుల్ బుక్ చేసుకొనే సౌకర్యాన్ని కూడా గూగుల్ కల్పిస్తోంది.
గూగుల్ తన బ్లాగు ద్వారా ఈ విషయాన్ని తెలియచేస్తూ.. మ్యాపులతో పాటు బిజినెస్ వినియోగదారులు తమకు కావాల్సిన, అవసరమైన ఇతర వ్యాపారస్తుల వివరాలు సైతం గూగుల్ మ్యాపులో దర్శనమిస్తాయి. ఉదాహరణకు మనం వెళ్లే హోటల్ వివరాలు.. అక్కడి యాజమాన్య సిబ్బందితో మాట్లాడే వీలు కల్పిస్తుంది. ఈ సౌకర్యం యాండ్రయిడ్, ఐఓఎస్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అయితే స్థానికి వ్యాపారులు గూగుల్ మ్యాప్స్‌లో తమ కంపెనీ వివరాలు ఇతరులకు అందుబాటులో ఉంచేందుకు ఆ ఫీచర్‌ను ఎనేబుల్‌లో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తారో... వారికి వారి బిజినెస్ ప్రోఫైల్స్‌లో ఒక మెసేజీ బటన్ గూగుల్ సెర్చ్‌లో అలాగే మ్యాప్స్‌లో కూడా కనిపిస్తుంది. దానిలో ఇతర బిజినెస్ సంస్థల అడ్రస్, చాట్ చేసేందుకు వివరాలు కనిపిస్తాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







