చాల్లేదు.. ఇంకా కావాలి: విమానంలో మహిళ రచ్చ
- November 15, 2018
ఎవరన్నారు బాస్.. మహిళలు మగవారికంటే తక్కువని.. ఎందులోనూ తక్కువ కాదు.. మళ్లీ మాట్లాడితే రెండాకులు ఎక్కువే.. వారికైతే అడిగినంత పోస్తారు.. మాకు మాత్రం ఎందుకివ్వరు.. మద్యం మత్తు నషాళానికి ఎక్కినా మరికొంత కావాలంటూ అసభ్య పదజాలంతో విమాన సిబ్బందిని దూషించింది ఓ నవ నాగరికురాలు.
అప్పటికే మోతాదుకు మించి మద్యాన్ని సేవించి ఉన్న ఐరిష్ మహిళ ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ విమానంలో ప్రయాణిస్తోంది. సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి క్యాబిన్ క్రూ కమాండర్‌కు ఫిర్యాదు చేశారు. ఇంకోసారి ఆమె మద్యం అడిగితే అస్సలు ఇవ్వొద్దని కమాండర్ సూచించారు.
అదే విషయం ఆమెకు చెప్పడంతో కోపంతో రగిలిపోయింది. తీవ్రపదజాలంతో సిబ్బందిని దూషించింది. పైలట్ వద్దకు వచ్చి అతని మీద ఉమ్మి వేసింది. ఆమె అంత చేస్తున్నా పైలట్ ఏమాత్రం కోప్పడలేదు. ఇంతకీ ఆమె ఎవరూ అని ఆరా తీస్తే ఓ
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ విభాగంలో లాయర్ అని తెలుసుకున్నారు విమాన సిబ్బంది.
బ్రిటన్‌కు చెందిన ఈ 50 ఏళ్ల లాయరమ్మ ఈనెల 10న ముంబై నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఎక్కింది. తనను తాను ఓ లాయర్ అని విమాన సిబ్బందిని పరిచయం చేసుకుంది. కొద్దిసేపటి తరువాత ఓ గ్లాస్ వైన్ కావాలని అడిగింది. అది తాగేసి మరో గ్లాస్ కావాలని కోరింది.
దీనికి సిబ్బంది నిరాకరించడంతో వారిని దుర్భాషలాడింది. అంతే కాకుండా మిమ్మల్ని కోర్టుకు ఈడుస్తా, ఇండియన్స్ అయిన మీరు డబ్బుకు కక్కుర్తి పడుతున్నారని నోటికి వచ్చినట్లు మాట్లాడింది. ఎయిర్ ఇండియా యాజమాన్యం పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో లండన్‌లోని హిత్రో విమానాశ్రయంలో ఆమెను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







