దీప్‌వీర్ పెళ్లి ఫొటోల కోసం వేచి చూస్తే అస్థి పంజరం అవుతారు!
- November 15, 2018
బాలీవుడ్ ప్రేమజంట దీపికా పదుకొనె - రణ్‌వీర్ సింగ్ వివాహం ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా జరిగింది. మొదట నిశ్చితార్థ వేడుక అనంతరం వివాహం జరిగింది. వరుడు రణ్‌వీర్ సీప్లేన్‌లో మండపానికి వచ్చాడు. దీపిక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి డిజైన్ చేసిన చీరను ధరించిందనట్టు తెలిసింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు వెళ్లకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో దీప్ రణ్ పెళ్లి ఫోటోల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా ఈ వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఆ విషయం తెలియజేస్తూ.. ఆసక్తికరమైన ట్విట్ చేశారు స్మృతీ. 'దీప్‌వీర్ పెళ్లి ఫొటోల కోసం చాలా సేపటి వరకు ఎదురుచూసినప్పుడు ఇలాగే ఉంటుంది' అంటూ ఓ బల్లపై కూర్చున్న అస్తిపంజరం ఫోటోను పోస్టు చేశారు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుభమా అని పెళ్లి చేసుకొంటుంటే.. ఈ అస్థిపంజరం ఏంటీ మంత్రి గారూ.. !! అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







