టాక్సీవాలా:రివ్యూ

- November 17, 2018 , by Maagulf
టాక్సీవాలా:రివ్యూ

న‌టీన‌టులు: విజ‌య్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు త‌దిత‌రులు 

సంగీతం : జేక్స్ బిజాయ్

ఫోటోగ్రఫీ : సుజిత్ సారంగ్ 

నిర్మాత : ఎస్.కె.ఎన్ 

దర్శకత్వం : రాహుల్ సాంకృత్యాన్ 

విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమా ఈరోజు రిలీజ్ అయింది.  నోటా పరాయజం తరువాత వస్తున్న సినిమా కావడంతో  దీనిపై అంచనాలు ఉన్నాయి.  మరి ఈ సినిమా ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దాం. 

కథ : 

నిరుద్యోగైనా విజయ్ ఉద్యోగం కోసం తన బాబాయ్ ఇంటికి వస్తాడు.  బాబాయ్ సహాయంతో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఎన్నో ఉద్యోగాలు చేస్తాడు.  అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండదు.  చివరకు ఓ సెకండ్ హ్యాండ్ కారును కొనుక్కుకొని క్యాబ్ డ్రైవర్ గా మారిపోతాడు. ఆ కారులో దెయ్యం వస్తుంది. విజయ్ ను ఆ దెయ్యం భయపెడుతుంది.  కారులో ఎక్కిన డాక్టర్ ను హత్య చేస్తుంది.  దీంతో షాక్ తిన్న విజయ్ కారును అమ్మిన వ్యక్తి ఇంటికి వెళ్లి కారు గురించి ఆ కారులోని దెయ్యం గురించి తెలుసుకుంటాడు. ఆ దెయ్యం ఎవరు..? డాక్టర్ ను ఎందుకు చంపింది అన్నది మిగతా కథ.  

విశ్లేషణ : 

 దెయ్యం కథలతో సినిమాలు గతంలో చాలా వచ్చాయి. అలాంటి తరహా కథ అయినప్పటికీ కొత్తగా ఉంటుంది.  కారులో దెయ్యం ఉండటం అది అందరిని భయపెట్టడం నవ్వును తెప్పిస్తాయి.  విజయ్ తన హీరోయిజాన్ని పక్కనపెట్టి భయపడే వ్యక్తిగా నటించాడు.  ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే కొత్త కాన్సెప్ట్ ను ఇందులో దర్శకుడు పరిచయం చేశాడు.  కథను ఎంచుకొని దానిని నడిపించిన తీరు బాగుంది.  ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతుంది.  సెకండ్ హాఫ్ లో దెయ్యం ఎవరనే కనిపెట్టే కోణంలో కథ నడుస్తుంది.  ప్రీ క్లైమాక్స్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన కథ క్లైమాక్స్ లో సాదాసీదాగా ముగించాడు.  

నటీనటుల పనితీరు : 

విజయ్ హీరోయిజాన్ని పక్కన పెట్టి కథకు అనుగుణంగా నటించి మెప్పించాడు.  హీరోయిన్ ప్రియాంకకు పెద్దగా పాత్ర లేకపోయినా గ్లామర్ తో ఆకట్టుకుంది.  మాళవిక నాయర్ కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించింది.  మిగతా పాత్రల్లో నటులు వారి పరిధిమేరకు మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు : 

సాంకేతికంగా సినిమా బాగుంది.  దర్శకుడు కథను ఎంచుకున్న తీరు.. దానిని నడిపించిన విధానం ఆకట్టుకునే విధంగా ఉన్నది.  ఫస్ట్ హాఫ్ ను డీల్ చేసిన విధంగా అద్భుతంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అక్కడడక్కడా సాగతీసినట్టుగా ఉండటం మినహాయించి మిగతా కథ అంతా బాగుంది. బిజాయ్ సంగీతం, సుజిత్ ఫోటోగ్రఫి ఆకట్టుకుంది.  నిర్మాణవిలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్ : 

కథ 

కథనాలు 

నటీనటులు 

నెగెటివ్ పాయింట్స్ : 

క్లైమాక్స్ 

చివరిగా : విజయ్ టాక్సీవాలాతో మెప్పించాడు.  

--మాగల్ఫ్.కామ్ రేటింగ్ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com