పీహూ:రివ్యూ

పీహూ:రివ్యూ

సినిమా పేరు: పీహూ
నటీనటులు: మైరా విశ్వకర్మ, ప్రేరణా శర్మ
సంగీతం: విశాల్ ఖురానా
కథ, స్క్రీన్‌ప్లే, దర్వకత్వం: వినోద్ కాప్రి

కథ: రెండు గంటల సినిమాని రెండేళ్ల చిన్నారితో తీశాడు దర్శకుడు. ఆద్యంతం ఆసక్తి కరంగా మలిచాడు. ఆ ఇంట్లో అమ్మా, తనే ఉంటారు. అమ్మ అర్థాంతరంగా కన్ను మూస్తుంది. ఆ విషయం చిట్టి తల్లికి తెలియదు. అర్థం చేసుకునే వయసు కూడా కాదు. అమ్మ చేసిన పనులు చూసి ఉండడం వలన తను కూడా అలానే చేయాలనుకుంటుంది.

ఆ క్రమంలో చిన్నారి చేసిన యాక్షన్ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ఆకలిగా ఉన్నప్పుడు స్టౌ వెలిగిస్తున్న సమయంలో కలిగే టెన్షన్, బొమ్మ కోసం పది అంతస్థుల మేడ పైనుంచి దూకే సంఘటన భయాన్ని గొలుపుతుంది. చిన్నారి అమ్మ కోసం కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు, తెలియక ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడుతుందోనన్న భయం ప్రేక్షకుడికి కలుగుతుంది.

కొన్ని దృశ్యాలు మరీ భయపెట్టేవిగా ఉన్నాయి. సినిమా మొత్తం పాప మైరానే కనిపిస్తుంది. తండ్రి పాత్రలో అతడి ఫొటోని మాత్రమే చూపిస్తారు. ఈ సినిమా ప్రతి తల్లిదండ్రులకు వచ్చే పీడకలలాంటిదని దర్శకుడు వినోద్ ట్రైలర్ ద్వారా వెల్లడించాడు. సంగీతం బావుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. కథ మొత్తం పాప చుట్టూనే తిరుగుతుంది.

మైరా చక్కగా నటించింది. తను తెలీక చేసే పనులు కూడా సన్నివేశానికి నప్పేట్టు దర్శకుడు మలచిన తీరు అద్భుతంగా ఉంది. మైరా తల్లి పాత్రలో నటించిన ప్రేరణ నిడివి కొంతసేపే అయినా ఆమె కూడా బాగా నటించారు. ఈ చిత్రం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకోవడానికి సిద్ధమైంది.

చిత్ర యూనిట్ మొత్తం పాపతో నాలుగు నెలలు ఉండి చిన్నారికి తాము అలవాటయ్యాక చిత్రీకరణ మొదలు పెట్టారు. అందుకే చిత్రం అంత బాగా వచ్చి అందర్నీ ఆకర్షిస్తోంది. దర్శకుని ప్రతిభ ప్రేక్షకుడికి తెలుస్తుంది.

Back to Top