నింగిలోకి దూసుకెళ్ళిన యూఏఈ శాటిలైట్
- November 17, 2018
యూఏఈ విద్యార్థులు తయారు చేసిన నానో శాటిలైట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళింది. వర్జీనియాలోని మిడ్ అట్లాంటిక్ రీజినల్ స్పేస్‌పోర్ట్ నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. సిగ్నస్ ఎన్‌సి10 ఫ్లైట్ ద్వారా ఈ ఉపగ్రహం నింగిలోకి వెళ్ళింది. నవంబర్ 15న ముందుగా ఈ శాటిలైట్‌ని ప్రయోగించాలనుకున్నా, కొన్ని కారణాలతో రెండు రోజులు ఆలస్యంగా అంటే నవంబర్ 17న లాంఛ్ చేశారు. ఎడ్యుకేషనల్ అవసరాల కోసం ఈ నానోశాటిలైట్‌ని రూపొందించారు. దీంట్లో ఓ కెమెరా భూమిని అబ్జర్వేషన్ చేయడానికి ఉపయోగపడ్తుంది. మస్దార్ ఇన్‌స్టిట్యూట్ దీన్ని డెవలప్ చేసింది. నెల రోజుల్లో యూఏఈ నిర్మించిన రెండో స్పేస్ ఆబ్జెక్ట్‌గా దీన్ని అభివర్ణించొచ్చు. ఇటీవలే ఖలీఫా శాటిలైట్‌ని జపాన్ నుంచి ప్రయోగించడం జరిగింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







