బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న కేటీఆర్
- November 17, 2018
ముంబై: రాష్ట్ర సీఎం కేసీఆర్‌ను ఎకనామిక్ టైమ్స్ వారి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఎకనామిక్ టైమ్స్ అవార్డుల ప్రదానోత్సవం ముంబైలో జరిగింది. సీఎం కేసీఆర్‌కు వచ్చిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సీఎం కేసీఆర్ తరుపున మంత్రి కేటీఆర్ అందుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డును మంత్రి కేటీఆర్‌కు అందించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్ తరుపున ధన్యవాదాలు తెలియజేశారు. భారతదేశంలో అత్యంత పిన్న వయసు గల తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మక మార్పులతో దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వకారణమన్నారు. ఈ అవార్డు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా మంత్రి అభివర్ణించారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన టీఎస్‌ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే కొత్త పరిశ్రమలకు అనుమతులు లభిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







