ఆకాశం నుంచి ఊడిపడ్డ ఫైర్ బాల్.. వీడియో

- November 19, 2018 , by Maagulf
ఆకాశం నుంచి ఊడిపడ్డ ఫైర్ బాల్.. వీడియో

మనం అప్పుడప్పుడూ చదువుతుంటాం. ఆకాశం నుంచి అది ఊడిపడింది. ఇది ఊడిపడింది అని. లేదంటే ఉల్కలు, తోక చుక్కలు అప్పుడప్పుడు ఆకాశం నుంచి భూమ్మీద పడుతుంటాయంటారు. వాటికి సంబంధించిన వార్తలు మనం చాలానే వింటుంటాం. తాజాగా ఓ ఫైర్ బాల్ కూడా ఆకాశం నుంచి ఊడిపడింది. యూఎస్‌లోని టెక్సాస్‌లో పెద్ద ఆకారంలో ఉన్న ఓ ఫైర్ బాల్ మండుతూ భూమ్మీద పడిపోయింది. గత గురువారం రాత్రి 9.22 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. అయితే.. ఈ ఘటన కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనపై స్పందించిన నాసా.. అది ఆస్టరాయిడ్ నుంచి విడిపోయిన ఉల్కా అనే వస్తువు అని.. అది రాయిలా ఉంటుందని.. భూమికి సమీపంలోకి రాగానే అది మండుతుందని.. భూమిని తాకగానే అది ఉల్కాపాతంగా మారుతుందని ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com