తెలుగు కళా సమితి 20వ వార్షిక వేడుకలు
- November 19, 2018
బహ్రెయిన్ తెలుగు కళా సమితి, 20వ వార్షిక ఉత్సవాలకు రంగం సిద్ధమయ్యింది. నవంబర్ 23న ఏసియన్ స్కూల్ - ఎపిజె అబ్దుల్ కలాం ఆడిటోరియం ఇందుకు వేదిక కానుంది. 'రంగస్థలం - ఆట పాట' పేరుతో ఈ మెగా షోని డిజైన్ చేశారు. భారతదేశం నుంచి పలువురు కళాకారులు, ఈ వేదికపై సందడి చేస్తారు. 2,500 మందికి పైగా తెలుగువారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సింగర్స్ మల్లికార్జున్, దామిని భట్ల, బిగ్‌బాస్ 2 తెలుగు ఫేం భానుశ్రీ, ఢీ డాన్స్ షో యశ్వంత్ ఈ డాన్స్ ఈవెంట్లో సందడి చేస్తారు. టికెఎస్ జనరల్ సెక్రెటరీ, ఈవెంట్ జనరల్ కన్వీనర్ ఎంబీ రెడ్డి మాట్లాడుతూ, ఈ షోని సూపర్ సక్సెస్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. టిక్కెట్స్, మెంబర్ పాస్‌ల కోసం గంగా సాయిని 36063322 నెంబర్లోనూ, అనిల్ పామిడిని 38829360 నెంబర్లోనూ సంప్రదించవచ్చు.
- ఎం.వాసుదేవ రావు, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







