ఇండియా:ఇంజిన్ లేని ట్రైన్.. ట్రైయిల్ రన్ సక్సెస్..
- November 19, 2018
ఇండియా:పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇంజిన్ రహిత రైలును ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ట్రైన్-18గా పేర్కొనే ఈరైలు మొరాదాబాద్-రాంపూర్ మధ్య పరుగులు పెట్టింది. వివిధ స్థాయిల్లో రైలు వేగాన్ని, ట్రైన్ బ్రేక్‌ల పనితీరును పరిశీలించారు. ఈ రైలును మొదట మొరాదాబాద్-బరేలి మధ్య ట్రయల్ రన్ నిర్వహించాలని భావించినప్పటికీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో మొరాదాబాద్-రాంపూర్ మధ్య పరీక్షించారు.
ఈ ట్రైన్ గంటకు 220 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదని అధికార వర్గాలు తెలిపాయి. 16 బోగీలతో ఉండే ఈ రైలులో దివ్వాంగులకు ప్రత్యేక మరుగుదొడ్లు, చిన్న పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. డ్రైవర్ బోగీకి రెండు వైపుల నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కదలికలు తెలుసుకోవడంతో పాటు ప్రమాదాలను నివారించడానికి ఈ కెమెరాలు ఉపయోగ పడతాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







