విలన్ గా మారనున్న వరుణ్ తేజ్
- November 20, 2018
ఈ మధ్య కాలంలో మన హీరోలకు నెగిటీవ్ పాత్రలపై మోజు మళ్లింది. `జై లవకుశ`లో ఎన్టీఆర్ ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో కనిపించాడు. రాజమౌళి సినిమాలోనూ ఎన్టీఆర్ ప్రతినాయకుడే అనే టాక్ వినిపిస్తోంది. రానా, ఆది పినిశెట్టి లాంటి హీరోలు నెగిటీవ్ పాత్రలు చేశారు.. ఇంకా ఇంకా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు వరుణ్‌తేజ్ కూడా నెగిటీవ్ పాత్రల వైపు దృష్టి సారించాడని సమాచారం. వరుణ్ తేజ్ కు తగిన పాత్ర కూడా దొరికింది. తమిళంలో ఘన విజయంసాధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం 'జిగర్తాండ'. ఇందులో సిద్దార్థ్ కథానాయకుడిగా నటించినా.. పేరు మొత్తం ప్రతినాయకుడిగా కనిపించిన బాబీ సింహాకు వెళ్లింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో కథానాయకుడి పాత్రని ఇంకాస్త డౌన్ చేసి, ప్రతినాయకుడి పాత్రకు మరింత హైప్ ఇవ్వాలని చూస్తున్నారట. ఆ పాత్రలో వరుణ్‌తేజ్ కనిపించనున్నాడని సమాచారం. 'జిగడ్తాండ' రైట్స్ దిల్‌రాజు దగ్గరే ఉన్నాయి. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ టేకప్ చేయనున్నాడని సమాచారం.
మరి సిద్దూ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారో, వరుణ్ తేజ్ ప్రతినాయక పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







